కొరాపుట్: జీడితోటలో ప్రేమికుల ఆత్మహత్య కలకలం సృష్టించింది. నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి పోలీస్‌స్టేషన్ పరిధి ముఖ్యా గ్రామంలోని జీడితోటలో అబ్బాయి పవిత్ర బోత్ర (19), ఒక కాలేజీ విద్యార్థిని (17) ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే చెట్టుకి ఉరి వేసుకున్నారు. పెద్దలు వీరి ప్రేమని అంగీకరించలేదు. నాలుగు నెలలు క్రితం పవిత్రతో వేరే అమ్మాయికి ఇచ్చి వివాహం చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఆత్మహత్యకి పాల్పడ్డారు. పొలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించారు.


