మల్కన్‌గిరి: అక్రమంగా నిల్వ చేసిన కలపను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మల్కన్‌గిరి సమితి యం.వి.24 గ్రామానికి చెందిన విధాన్ బైరాగీ ఇంట్లో అనుమతి లేకుండా విలువైన కలపను నిల్వ ఉంచినట్టు జిల్లా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందింది. దీంతో మంగళవారం అటవీశాఖకు చెందిన సిబ్బంది విధాన్ బైరాగీ ఇంటిపై మెరుపు దాడి చేసి తనిఖీలు చేపట్టగా 124 విలువైన కలప చెక్కలు పట్టుబడ్డాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు వున్నాయి విధాన్ బైరాగీని అరెస్టు చేశారు. వీటి విలువ రూ. లక్షల్లో ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
ఒకరి అరెస్టు


