రాయగడ: గ్రామీణ ప్రాంత యువతులకు స్వావలంబన దిశగా తీసుకువెళ్లడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రామనగుడ సమితి పరిపాలన కీలక చర్య చేపట్టింది. దీనిలో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన కింద రెండు దశల్లో 25 మంది మహిళా అభ్యర్థులను నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఎంపిక చేశారు. ఎంపికై న యువతులకు సహాన క్లోతింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నైనుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆధునిక నైనుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం వారికి ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని బీడీఓ ప్రద్యుమ్నయ మండల్ తెలిపారు. తహసీల్దార్ ప్రాణకృష్ణ పాణిగ్రహి, బీపీఎం సంతోష్ రత్నాలు, సహాన క్లోతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.


