పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలో ఒక ప్రైవేట్ భవనంలో నడుపుతున్న ప్రియదర్శిని కాన్వెంట్ స్కూల్ అమ్మకానికి పెట్టారని తెలిసిన స్కూల్ ప్రిన్సిపాల్ వి.రమేష్ భార్య శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అధికారితో మాట్లాడారు. నలభై ఏళ్లుగా ప్రియదర్శిని కాన్వెంట్ నడుపుతున్న యాజమాన్యం స్కూల్ భవనం అమ్ముతున్నారని, రిజిస్ట్రేషన్ జరుగుతుందని తెలిసినట్టు విలేకరులకు తెలియజేశారు. ఈ విషయంపై భవనం హక్కుదారులు రాజవీధికి చెందిన వైశ్యరాజు సుకుమార్ రాజు, వి.శక్తికుమార్ రాజులు తమకు ఈ విషయం తెలియదని అంటున్నారు. స్కూల్ ఇదివరకు అమ్మకానికి పెట్టినప్పుడు పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ ఇంటి ఓనర్‌తో కోన్నేళ్లకు లీజ్‌కు తీసుకున్నారు. ఇప్పుడు ఆకస్మికంగా అమ్ముతున్నారని తెలిసి సబ్‌రిజిస్ట్రారు అధికారితో మాట్లాడారు. ఈ భవనం అమ్మితే 250 మంది పిల్లల భవిష్యత్ ఏమవుతుందని ప్రిన్సిపల్ పట్నాయక్ చెబుతున్నారు. ఈ ప్రైవేట్ భవనం యాజమాన్యానికి అన్ని డాక్యుమెంట్లు ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వానికి అభ్యతరం ఉండదని సబ్‌రిజిస్ట్రార్ తెలియజేశారు.


