శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్స్ సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి బాలబాలికల సాఫ్ట్‌బాల్ సెలక్షన్ ట్రయల్స్‌కు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులను జిల్లా ప్రాబబుల్స్ జట్లకు ఎంపిక చేస్తామని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎంవీ రమణ చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లాలో అక్టోబర్ 14 నుంచి 15 వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా జట్లను పంపిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యాక్షులు మెట్ట తిరుపతిరావు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ సత్యనారాయణ, రాంబాబు, మౌళి బాబూజీ, ఢిల్లీశ్వరరావు, దవళ పెంటయ్య, ఎ.ఢిల్లీరావు, రాజగోపాల్, డాక్టర్ పి.రమేష్, బి.శ్రీనివాసరావు, గౌరి, హరికృష్ణ, వెంకటరమణ, రామ్మోహన్, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.


