జనవరిలో ఉత్తరాంధ్ర కవి సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

జనవరిలో ఉత్తరాంధ్ర కవి సమ్మేళనం

Sep 21 2026 12:32 AM | Updated on Sep 21 2026 12:32 AM

శ్రీకాకుళం కల్చరల్‌: రానున్న జనవరిలో శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర స్థాయి కవి సమ్మేళనం నిర్వహించాలని తెలుగు రచయితల వేదిక(తెరవే) ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని కిల్లాన కాంప్లెక్స్‌ ఆవరణలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ఆర్‌.వి.రమణమూర్తిల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెరవే సభ్యుల కవితా రచనలతో ఓ పుస్తకాన్ని విడుదల చేయాలని మరో తీర్మానం ఆమోదించారు. సమావేశంలో రచయితలు కిల్లాన శ్రీనివాసరావు, మంగిపూడి శ్రీనివాసరావు, నిక్కు హరిసత్యనారాయణ, వావిలపల్లి రాజారావు, లలితారెడ్డి, తోట గోపాలరావు, బాలాజీ రవికిరణ్‌, తాళ్ళూరు విజయలక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement