పట్టుపురంలో నాగ్‌ అశ్విన్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

పట్టుపురంలో నాగ్‌ అశ్విన్‌ సందడి

Sep 5 2026 7:07 AM | Updated on Sep 5 2026 7:07 AM

పట్టుపురంలో నాగ్‌ అశ్విన్‌ సందడి యువతి అదృశ్యం డ్రైవర్‌ నిజాయితీ ● బంగారం ఉన్న బ్యాగు అప్పగింత సచివాలయ ఉద్యోగుల పోరుబాట

మెళియాపుట్టి: పట్టుపురంలో జరిగిన ఒక వివా హ వేడుకకు కల్కి సినిమా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సతీసమేతంగా శుక్రవారం హాజరయ్యా రు. తనతోపాటు డైరెక్టర్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన నంబాళ్ల వెంకటరమణ తన స్వగ్రామం పట్టుపురంలో(పక్కనే చాపరలో ఉన్న ఒక కల్యాణ మండపంలో) వివాహం చేసుకున్నా రు. దీంతో నాగ్‌ అశ్విన్‌తో పాటు అతని భార్య ప్రియాంకదత్‌, మరికొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీంతో పలువురు యు వకులు, అభిమానులు ఆయనతో సెల్ఫీలకు ఎగబడ్డారు.

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా కేంద్రంలోని పరాంకుశ్‌నగర్‌ కాలనీకి చెందిన యువతి అదృశ్యమైనట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. భర్త చనిపోవడంతో రైతు బజారులో పిండిమిల్లు నడుపుతున్న ఒక మహిళ తన చిన్న కుమార్తెతో కలిసి పరాంకుశ్‌నగర్‌లో నివసిస్తోంది. బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన ఆమె కుమార్తె ఒక ప్రైవేటు ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్పత్రి విధులకని బయల్దేరింది. 1.45కి తల్లి ఫోన్‌ చేస్తే ఆటోలో వెళ్తున్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో కుటుంబ సభ్యులను ఆస్పత్రి వద్ద కనుక్కోమని పంపింది. అయితే సదరు యువతి విధులకు రాలేదని ఆస్పత్రి వర్గాలు చెప్పడం, రాత్రి అయినా ఇంటికి చేరకపోవడంతో శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా కేంద్రంలోని పెద్దపాడు వద్ద టాటా మ్యాజిక్‌ వ్యాన్‌లో పోగొట్టుకున్న 3 తులాలు బంగారమున్న బ్యాగును తిరిగి బాధితునికి అదే వ్యాను డ్రైవర్‌ పోలీసుల సమక్షంలో అప్పగించారు. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నందిగాం మండలం ఆనందపురానికి చెందిన రాము అనే వ్యక్తి బిలాయి వెళ్లేందుకు గురువారం సాయంత్రం బయల్దేరాడు. నందిగాం నుంచి శ్రీకాకుళం చేరి అక్కడి నుంచి బస్సులో విజయనగరం రైల్వేస్టేషన్‌కు వెళ్లి, ట్రైన్‌లో వెళ్లేందుకు ప్రణాళిక వేసుకున్నాడు. దీనిలో భాగంగా నందిగాంలో టాటా మ్యాజిక్‌ వ్యాన్‌ ఎక్కి పెద్దపాడు వద్ద దిగి ఆటోకి మారాడు. ఆటో ఎక్కాక గానీ బంగారం, రూ.3 వేలు నగదు, 4 కిలోల జీడిపప్పున్న బ్యాగు మర్చిపోయిన విషయం తెలియరాలేదు. అయితే మ్యాజిక్‌ వ్యాన్‌ డ్రైవర్‌ రవికుమార్‌ తనకు తానే శుక్రవారం రాత్రి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు బ్యాగుతో సహా రావడంతో బాధితుడైన రామును రప్పించిన పోలీసులు బ్యాగును రవి చేత ఇప్పించారు.

బీచ్‌రోడ్డు: పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జోన్‌–1 జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వందలాది మంది ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు ఈ దీక్షలు కొనసాగుతాయని సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే జోన్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో భార్గవ్‌ సుతేజ్‌, నిఖిల్‌ కృష్ణ, అబ్దుల్‌ రజాక్‌, శంకర్‌, మధుబాబు, సుమంత్‌ అబ్రహం, నాగేశ్వరరావు, బండారు శ్రీనివాస్‌, పార్థసారథి, శ్రీరామ్‌ నాయుడు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement