రాయగడ: సదరు సమితి పరిధిలోని గుమ్మ ఘాట్‌లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం ప్రమాదం కారణంగా సుమారు 5 గంటల పాటు ట్రాఫిక్ నిలిచింది. శుక్రవారం జరిగిన మరో ప్రమాదం కారణంగా జాతీయ రహదారి–326పై దాదాపు ఎనిమిది గంటలుగా రాకపోకలు నిలినిచిపోయాయి. వందలాది వాహనాలు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమాచారం ప్రకారం గుమ్మప్రాంతంలో గల ఘాట్ సమీపంలో ఓ లారీ యంత్రిక లోపం కారణంగా రహదారిపై నిలిచిపొయింది. అదే సమయంలో గుమ్మ ఘాటిలోని మలువు వద్ద వెనుక నుంచి వచ్చిన మరో ట్యాంకర్ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటన అర్ధ రాత్రి సమయంలో చోటు చేసుకోవడంతో అప్పటి నుంచి రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ ప్రమాదం కారణంగా రాయగడ మీదుగా కాసీపూర్, కోరాపుట్‌లకు పూర్తిగా రాకపోకలు నిలిచిపొయాయి. సమాచారం అందుకున్న కుంభికోట పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మలుపు వద్ద రహదారిని విస్తరించాలని వాహన చొదకులు కోరుతున్నారు.
సాగర్ సౌందర్యీకరణకు
రూ. 37 కోట్లతో ప్రతిపాదన
జయపురం:
జయపురం పట్టణంలో చారిత్రాత్మక జగన్నాథ్ సాగర్ సౌందర్య కరణకు రూ. 37 కోట్లతో రారష్ట్‌ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో జయపురం ప్రసిద్ధ చారిత్రాత్మక జగన్నాథ్ సాగర్ అభివృద్ధి, సుందరీకరణపై చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగరం చుట్టూ వాకింగ్ ట్రాక్, పార్క్ లైటింగ్, బోటింగ్ సౌకర్యం, పర్యాటక కేంధ్రంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నన్నారు. దీని కోసం రూ.1.37 కోట్ల వ్యయపు అంచనాతో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నట్లు మున్నిపల్ పాలిటీ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్ వెల్లడించారు. సమావేశంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బి.సునీత, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి హసన్ మధాని,మునిసిపాలిటీ ఇంజనీర్ సుధార్ కుమార్ జాని,సీనియర్ ఇంజనీర్ హేమంత కుమార్ పండ,మునిసిపాలిటీ కౌన్సిలర్లు పాల్గున్నారు.


