ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

Sep 5 2026 7:07 AM | Updated on Sep 5 2026 7:07 AM

మున్సిపల్‌ చైర్మన్‌ మహేష్‌ పట్నాయక్‌

రాయగడ: కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాయగడ మున్సిపల్‌ చైర్మన్‌ మహేష్‌ పట్నాయక్‌ అన్నారు. స్థానిక మజ్జిగౌరి కార్పెంటర్స్‌ అసోసియేషన్‌ 45వ వార్షికోత్సవం శుక్రవారం ఆ అసోసియేషన్‌ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన మాట్లాడుతూ.. జిల్లా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయని వివరించారు. ప్రధానంగా కార్మిక వర్గానికి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నార. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులు, వారి కుటుంబాల ఆర్ధికాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి బీపీఎల్‌ కార్డులు అందేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డివిజినల్‌ లేబర్‌ కమిషనర్‌ సురేష్‌ చంద్ర మండల్‌ మాట్లాడుతూ.. కార్మికులు తమ లేబర్‌ కార్డులను సకాలంలో ఆధునీకరించుకోవాలని సూచించారు. లేబర్‌ కార్డులు సక్రమంగా ఆప్‌డేట్‌ చేసుకున్నప్పుడే ప్రభుత్వ సంక్షేమ పఽథకాల ప్రయోజనాలు సులభంగా పొందగలరన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది చందన్‌ హరేంద్ర నాఽథ్‌ మాట్లాడుతూ.. కార్మికులంతా ఐక్యంగా ఉంటే సమస్యలను సమష్టిగా పరిష్కరించుకోవచ్చాన్నారు. కార్పెంటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిత్తూరి సొంబాబు మాట్లాడుతూ.. గత 45 ఏళ్లుగా సంఘం కార్మికుల సంక్షేమం కోసం అనేక ప్రజా హిత కార్యక్రమాలను నిర్వహిస్తువస్తుందన్నారు. కార్పెంటర్‌ వృత్తిపై ఆధారపడి రాయగడలో సుమారు 15 వందల కుటుంబాలకు పైగా జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. కార్మికులందరికీ మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా జిల్లా యంత్రాంగం సహకరించాలన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు సునీల్‌ కర్‌, తదితర ప్రముఖులు ప్రసంగించారు.

కొలువు దీరిన కొత్త కార్యవర్గం..

మజ్జిగౌరి కార్పెంటర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. సంఘం అధ్యక్షుడిగా చిత్తూరి సొంబాబు, ఉపాధ్యాక్షుడిగా పి.ఈశ్వరరావు, కార్యదర్శిగా అరసాడ అనంత్‌, సహకార్యదర్శిగా తామాడ శ్రీనివాస్‌, కోశాధికారిగా లక్కొజి సురేష్‌, సహ కోశాధికారిగా బి.సురేష్‌, సలహాదారులుగా ఎ.జగన్మోహన్‌ రావు, సిహెచ్‌ రామకృష్ణ, ఎ.సత్యనారాయణ, కె.శ్రీనివాస్‌ రావు, పి.గౌరి శంకరరావు, ఎ.పోలిరాజు, ఎగ్జిక్యూటీవ్‌ సభ్యులుగా కొవాడ గౌరి, వి.సత్యనారాయణ, ఎ.జగదీష్‌, కె.రుద్ర, ఎం.శివ, ఎం.గంగరాజు, నాయుడు సతీష్‌, అశోక్‌ మాఝి, నాయుడు గౌరి, బి.శంకరరావు, ఎం.గౌరి, కె.ఆచారి, టి.జనార్దన ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement