జయపురం: బంగారు గొలుసు దొంగిలించిన ముగ్గురు నిందితులను జయపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారు జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి బుటుగుడ గ్రామం సనసాయి హరిజన్, అదే గ్రామస్తులు కమల లోచన బారిక్ ,భుబణ హరిజన్ లు అని జయపురం పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంధ్ర రౌత్ శుక్రవారం వెల్లడించారు. ముగ్గురు నిందితులు ఆగస్టు 27 వ తేదీన జయపురంలో ఒక మహిళ మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రాలతో ఉన్న గొలుసును తెంచుకు పోయారని ఆ మహిళ 29 వ తేదీన పట్టణ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేయబడిన నిందితులు మహిళ మెడలో బంగారు గొలుసు దొంగిలిచినట్లు గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. కేసు ఇంకా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
మరో ముగ్గురు అరెస్టు
పర్లాకిమిడి: పర్లాకిమిడిలో ముక్కుడమ్మ మహిళా స్వయం సహాయక గ్రూప్, మైక్రో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సుమారు రెండుకోట్ల రూపాయల రుణాలు తీసుకుని కలెక్షన్ ఎగవేత, నిధులు దుర్వినియోగం, మోసం కేసులో మరో ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు డీఎస్పీ అమితావ్ పండా తెలియజేశారు. శుక్రవారం అరెస్టయిన వారిలో కాళీప్రసాద్ పండిట్ (54)(విక్టరీ కాలనీ), భక్షీవీధికి చెందిన సపన్‌కుమార్ పాణిగ్రాహి (57), రాజవీధికి చెందిన అశోక్‌కుమార్ మహరాణా (37)లను శుక్రవారం సబ్ డివిజనల్ మాజిస్ట్రేట్ కోర్డులో వారిని హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి ట్రాన్స్‌జెండర్ సిద్ధకుమార్ అలియాస్ లక్కీని గత నెల 29న హైదరాబాదు యూసఫ్‌గుడలో అరెస్టుచేసిన విషయం తల్సిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ఎస్.స్వాతి పరారిలో ఉన్నట్టు తెలియజేశారు. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు.


