పర్లాకిమిడి: విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం మరియు పూజ్య స్వామి లక్ష్మణానంద సరస్వతీ బలిదాన దినోత్సవాన్ని రాయఘడ బ్లాక్ బిసంపాడి గ్రామంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి.హెచ్.పి నాయకులు తరిణీ చరణ్ దాస్, అధ్యక్షుడు కై లాస్ చంద్ర గౌడో, కార్యదర్శి శ్యాంసుందర శోబోరో తదితరులు పాల్గొని స్వామి లక్ష్మణానంద సరస్వతీని అన్యాయంగా హతమార్చడాన్ని నిందించారు. శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా భాగవతంలో పలు ప్రవచనములను తరిణీ చరణ్ దాస్ తెలియజేశారు. భక్తులు విశేషంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.


