పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ మహేంద్రరి వద్ద ద్వితీయ రాష్ట్ర ఎం.టి.బి మహిళా సైక్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలను మోహనా ఎమ్మెల్యే దారరథి గోమాంగో శుక్రవారం ఉదయం ప్రారంభించారు. సైక్లింగ్ పోటీలకు రాష్ట్ర స్థాయిలో మహిళా సైక్లింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో మాట్లాడుతూ.. పర్యాటక కేంద్రం మహేంద్రగిరి వద్ద ఇటువంటి సైక్లింగ్ పోటీలు నిర్వహించడం వల్ల ఈ ప్రాంతం క్రీడాకారులకు కేంద్రంగా మారునుందన్నారు. ఈ నెల 6 వరకు ట్రెక్కింగ్, వివిధ పోటీలు జరుగనున్నాయని భుభనేశ్వర్ నుంచి విచ్చేసిన అస్మితా ఖేలో ఇండియా అధికారులు తెలియజేశారు.


