అంబులెన్స్‌ ఢీకొని ఉపాధ్యాయుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌ ఢీకొని ఉపాధ్యాయుడు దుర్మరణం

Sep 5 2026 7:01 AM | Updated on Sep 5 2026 7:01 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి కియాంగ్‌ గ్రామం వద్ద శుక్రవారం ఉదయం అంబులెన్స్‌ ఢీకొని ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. జనగణన సర్వేకు వెళ్తుండగా విషాదం చోటుచేసుకుంది. సాలిమ్‌ పంచాయతీ నూవగుడా గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు హనురామ్‌ నాయక్‌ ఇంటి నుంచి బయలుదేరి స్కూటీపై కియాంగ్‌ పంచాయతీ బిజ్‌పధర్‌ గ్రామానికి వెళ్తుండగా కియాంగ్‌ గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన అంబులెన్స్‌ స్కూటీను బలంగా ఢీకొట్టడంతో హన్‌రామ్‌ ఎగిరి పడిపోవంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అదే అంబులెన్స్‌లో మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే హనురామ్‌ నాయక్‌ చనిపోయినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మాత్తిలి పోలీసులు ఆరోగ్య కేంద్రానికి చేరుకొని కేసునమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ఐఐసీ దీపాంజలి తెలిపారు. కాగా ప్రమాద సమాచారం తెలిసిన వేంటనే హనురామ్‌ నాయక్‌ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement