64 కేసుల్లో నిందితుడిపై చర్యలకు ప్రభుత్వం ఆమోదం | - | Sakshi
Sakshi News home page

64 కేసుల్లో నిందితుడిపై చర్యలకు ప్రభుత్వం ఆమోదం

Sep 5 2026 7:01 AM | Updated on Sep 5 2026 7:01 AM

రాయగడ: జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన 64 కేసులతో సంబంధం ఉన్నట్లు పో లీసులు పేర్కొన్న హడప శివ పై కలెక్టర్‌ జారీ చేసిన నిర్భంద ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జాతీయ భద్రతా చట్టం–1980 (ఎన్‌ఎస్‌ఏ) కింద జారీ చేసిన ఈ ఉత్వర్వులను రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక విభాగం సెప్టెంబరు 3 వ తేదీన ఆమోదించినట్లు వెల్లడైంది. పోలీసుల నుంచి అందిన వివరాల ఆధారంగా హడప శివపై రాయగడ జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లలో 64 కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా చట్టం కింద అతడిని నిర్భంధంలో ఉంచేందుకు రాయగడ జిల్లా కలెక్టర్‌ అశుతొష్‌ కులకర్ణి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా రాష్ట్ర హోం శాఖ జారీ చేసిన నిర్భంధ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినట్లు స్పష్టం చేసింది. దీంతో శివ నిర్బంధ ప్ర క్రియకు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక అనుమతి లభించినట్టైంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శివను ప్రస్తుతం సంబల్‌పూర్‌ సర్కిల్‌ జైలులో నిర్భంధంలో ఉంచారు. తదుపతి ఉత్తర్వులు వెలువడే వరకు అతడు నిర్బంధంలోనే కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉత్వర్వుల్లో శివ వయసు 40 ఏళ్లుగా, తండ్రి పేరు హడప గుణగా, రాయగడ పట్టణంలోని రెల్లి వీధికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నా రు. జిల్లాలో పలు కేసుల్లో సంబంధం ఉన్న వ్యక్తిపై జాతీయ భద్రత చట్టం కింద జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోవడం, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దానిని ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement