ఆరో విడత పీఎం కిసాన్‌ నిధులు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఆరో విడత పీఎం కిసాన్‌ నిధులు విడుదల

Sep 5 2026 7:01 AM | Updated on Sep 5 2026 7:01 AM

గజపతి జిల్లాలో 47,243 మంది రైతులకు లబ్ధి

పర్లాకిమిడి: పీఎం కిసాన్‌ సహాయత పథకం కింద ఒడిశాలో ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతులకు డీబీటీ ద్వారా పర్లాకిమిడి ఆర్‌.శెఠి భవనంలో శుక్రవారం అందజేశారు. ఆరో విడత పీఎం కిసాన్‌ నిధులు విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో ప్రసారం చేసిన కార్యక్రమాన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మోహానా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి, జిల్లా పరిషత్తు అధ్యక్షులు గవర తిరుపతి రావు, ఏడీఎం మునీంద్ర హానగ, సీనియర్‌ వైజ్ఞానికులు, ఆర్‌.ఉదయగిరి డాక్టర్‌ సంగ్రాం పరంగురు, వ్యవసాయ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ శివచరణ్‌ శెఠి తదితరులు పాల్గొన్నారు. గజపతి జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువులు, ఇతర ఖర్చులకు 47,243 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 9.53 కోట్లు విడుదల చేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారి రవీంద్ర కుమార్‌ అధెక్‌, ఆదనపు వ్యవసాయ అధికారి సరోజ్‌ కుమార్‌ పాత్రో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement