మల్కన్‌గిరి: గంజాయి అక్రమ నిల్వల గుట్టురట్టయింది. మల్కన్‌గిరి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బింబాధర్ పండా ఆదేశాలతో జిల్లా మొబైల్ యూనిట్ అధికారులు బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో డైక్–2 గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా రవాణా చేసేందుకు గంజాయి సిద్ధంగా ఉంచినట్టు అందిన సమాచారం మేరకు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. బస్తాల్లో నిల్వ ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని చిత్రకొండ సమితిలో మారుమూల గ్రామాల నుంచి పడవల్లో తరలించి ఇతర రాష్ట్రాలకు పంపించేందుకు వీలుగా బస్తాల్లో ప్యాక్ చేసి సిద్ధం చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని శుక్రవారం చిత్రకొండ తహసీల్దార్ ప్రశాంత్ కుమార్ సమక్షంలో తూకం వేయగా 215 కిలోలు ఉంది. దీని విలువ 22 లక్షల రూపాయలు ఉంటుందని ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ బింగరాజ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ టంకధర్ దామీ తెలిపారు. కేసు నమోదు చేసి గంజాయి ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.


