రూ.90,930 అందజేత | - | Sakshi
Sakshi News home page

రూ.90,930 అందజేత

Sep 4 2026 2:24 AM | Updated on Sep 4 2026 2:24 AM

రెడ్‌క్రాస్‌ సొసైటీకి..

జయపురం: రెడ్‌ క్రాస్‌ సొసైటీకి రూ.90,930లను మానవ సేవా కేంద్రం అందజేసిందని ఆర్గనైజర్‌ జయపురం చాంబర్‌ ఆఫ్‌ కామర్ష్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ అధ్యక్షుడు సంజయ్‌ కుమార్‌ జైన్‌ గురువారం వెల్లడించారు. 2026 ఆగస్టు 18 తేదీన స్థానిక జైన్‌ భవనంలో శ్రావణ మేళా సందర్భంగా మానవ సేవా కేంద్రం నిర్వహించి మేళాలో వస్తువుల అమ్మకాలు రూ.50,200 రెడ్‌క్రాస్‌ సొసైటీకి నిధిగా జయపురం సబ్‌కలెక్టర్‌ జాదుమణి నాయక్‌కు అందజేసిందని వెల్లడించారు. 2026 ఆగస్టు 22, 23 తేదీల్లో జయపురం శుభం కల్యాణ మండపం ప్రాంగణంలో మానవ సేవా కేంద్రం నిర్వహించిన శ్రావణ మేళాలో వస్తువులు విక్రయించగా వచ్చిన నగదు రూ.40,730లను రెడ్‌క్రాస్‌ నిధికి జయపురం తహసీల్దార్‌కు అందజేసినట్లు వెల్లడించారు. సబ్‌ కలెక్టర్‌కు రెడ్‌క్రాస్‌ సొసైటీకి నిధిని అందజేసిన వారిలో సంజయ కుమార్‌ జైన్‌, మమతా జైన్‌, సొనాలి జైన్‌, చాంబర్‌ డైరెక్టర్లు దిలీప్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement