సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు

Sep 4 2026 2:24 AM | Updated on Sep 4 2026 2:24 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ వినతులను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రీకాకుళం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం జిల్లా రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి ఆయన పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి రెవెన్యూ అధికారి ఈ–ఆఫీస్‌ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని, సివిల్‌ కోర్టు కేసులు, వివాదాస్పద భూముల కేసుల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. జిల్లాలో ఆరో విడత కింద 160 గ్రామాల్లోని 97,917.996 ఎకరాల ప్రైవేట్‌ భూమికి సంబంధించి రీసర్వే ప్రక్రియ కొనసాగుతుండగా, ఇప్పటివరకు 22,252 గ్రౌండ్‌ ట్రూతింగ్‌ నోటీసులు జారీ చేశారని, 36,228.292 ఎకరాల్లో ఈ–కేవైసీ పూర్తయిందని సమీక్షలో వెల్లడించారు.

కుమారుడికి తలకొరివి పెట్టిన తల్లి

శ్రీకాకుళం రూరల్‌ : కుమారుడికి తల్లి తలకొరివి పెట్టిన ఘటన గురువారం వప్పంగి గ్రామంలో చోటుచేసుకుంది. బాణ్న రాజులు తన కుమారుడు శేషాద్రిని ఇంజినీరింగ్‌ వరకు చదివించింది. శేషాది జార్ఖండ్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని గురువారం గ్రామానికి తీసుకొచ్చారు. ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడడంతో తల్లి రాజులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తలకొరివి పెట్టింది.

ఆదిత్యాలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం రేపు

శ్రీకాకుళం కల్చరల్‌: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 5న ఉదయం 10.45 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఉప కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు దేవస్థానంలో చైర్మన్‌, ధర్మకర్త మండలి సభ్యులు, ఎక్స్‌ఆఫీషియో మెంబర్‌తో కలిపి మొత్తం 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement