ఖరడ జంక్షన్‌ వద్ద గంధపు చెక్కలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఖరడ జంక్షన్‌ వద్ద గంధపు చెక్కలు స్వాధీనం

Sep 4 2026 2:24 AM | Updated on Sep 4 2026 2:24 AM

పర్లాకిమిడి: జిల్లాలో కాశీనగర్‌ బ్లాక్‌ ఖరడ గ్రామం జంక్షన్‌ వద్ద ఒక ఆటోను కాశీనగర్‌ పోలీసు పెట్రోలింగ్‌ సిబ్బంది తనిఖీలలో 105 కిలోల గంధపు చెక్కలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 5.30ల సమయంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు కాశీనగర్‌–గుణుపురం రోడ్డు ఖరడ గ్రామం వద్ద పోలీసులు ఆటోను తనిఖీచేయగా ఆటోలో 105 కిలోల గంధపు చెక్కలు దొరికాయి. వాటి విలువ మార్కెట్‌లో పదిలక్షల రూపాయలు ఉంటుందని ఇన్వెస్టిగేషన్‌ అధికారి పంచానన బెహారా తెలియజేశారు. పోలీసులను చూసిన ఆటో డ్రైవర్‌ ఖరడ జంక్షన్‌ వద్ద నుంచి తప్పించుకుని అధిక స్పీడులో వెళుతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్తు చేశారు. వారి వద్ద నుంచి నగదు రూ.4వేలు, 3 చరవాణులు, 105కిలోల గంధపు చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారు ఖరడాకు చెందిన సిరాజ్‌ ఖాన్‌, అక్రం ఖాన్‌, టంగీ, ఖుర్దా, దామోదర్‌ ప్రధాన్‌, గ్రామం సన్నసోడా, రామగిరికి చెందినవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement