మల్కన్‌గిరి: మల్కన్‌గిరి కళాశాలలో గురువారం యూత్ రెడ్‌క్రాస్ యూనిట్ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ చిత్తరంజాన్ బారిక్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ప్రధాన వైద్యులు కృష్ణచంద్ర మాహాపాత్రో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల సమాజంలో చాలాచోట్ల ఇంకా వివక్ష కొనసాగుతుందన్నారు. అనంతరం క్విజ్ పోటీలను నిర్వహించి విజేయతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రేమరేఖ భత్ర, దీప్తిరేఖ మిశ్రో, విజయలక్ష్మి శేఠి, ఆకాశ్ పడియమి, తదితరులు పాల్గొన్నారు.


