ఉసురుతీసిన ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ఉసురుతీసిన ఈత సరదా

Sep 4 2026 2:24 AM | Updated on Sep 4 2026 2:24 AM

హిరమండలం: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల కోసం వచ్చి చెరువులో స్నానానికి దిగి ఓ విద్యార్థి మృతిచెందాడు. ఎల్‌ఎన్‌పేట మండలం రావిచంద్రిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రావిచంద్రి గ్రామంలో ఓ యువకుడి పుట్టిన రోజు వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి 20 మంది స్నేహితులు వచ్చారు. అందరూ కలిసి సరదాగా చెరువులో స్నానానికి దిగారు. అందులో మోహనరావు (16) అనే బాలుడికి ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. స్నేహితులతో పాటు స్థానికులు కలిసి గాలించి బయటకు తీశారు. వెంటనే ఆటోలో ఎల్‌ఎన్‌పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మోహనరావు స్వస్థలం విశాఖపట్నంలో జ్ఞానాపురం. ఐటీఐ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితుడు పుట్టిన రోజు వేడుకలకు గురువారం ఉదయం రావిచేంద్రి వచ్చాడు. మోహనరావు తండ్రి జగన్‌ వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి చిట్టి గృహిణి. సరుబుజ్జిలి పోలీసులు పీహెచ్‌సీకు చేరుకుని వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement