ఆస్తి నేరాలపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ఆస్తి నేరాలపై ప్రత్యేక దృష్టి

Sep 2 2026 12:24 AM | Updated on Sep 2 2026 12:24 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : పెండింగ్‌లో ఉన్న ఆస్తి నేరాల కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించి కోర్టులో చార్జిషీట్‌ దాఖలయ్యేలా చూడాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆస్తి నేరాల్లో సీసీ కెమెరాల ఫుటేజీ కీలకంగా మారుతుందన్నారు. నేరం జరిగే ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించి నేరస్థుల కదలికలను గుర్తించాలని, భౌతిక ఆధారాలతో పాటు సాంకేతిక ఆధారాలను శాసీ్త్రయ పద్ధతిలో సేకరించి దర్యాప్తు చేపట్టాలన్నారు. నేరస్థుల గత చరిత్ర, నేరం జరిగే విధానం, సాంకేతిక ఆధారాలు సమన్వయం చేసుకోవాలన్నారు. హౌస్‌ బ్రేకింగ్‌, చైన్‌ స్నాచింగ్‌, రోబరీ, డెకాయిట్‌, మర్డర్‌ ఫర్‌ గెయిన్‌, ద్విచక్రవాహనాల దొంగతనాలు వంటివి పెండింగ్‌ కేసులు పూర్తిచేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement