బయో మైనింగ్‌కు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

బయో మైనింగ్‌కు శ్రీకారం

Sep 2 2026 12:30 AM | Updated on Sep 2 2026 12:30 AM

బయో మైనింగ్‌కు శ్రీకారం

రాయగడ: పట్టణాన్ని పరిశుభ్రంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దే దిశగా మున్సిపాలిటీ కీలక ముందడుగు వేసింది. స్థానిక మజ్జిగౌరి మందిరానికి సమీపంలోని పాత డంపింగ్‌ యార్డులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సుమారు 60 వేల మెట్రిక్‌ టన్నుల లెగసీ వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో తొలగించి, పునర్వినియోగం చేసి వ్యర్థాల శాసీ్త్రయ శుద్ధి ప్రక్రియ (బయో మైనింగ్‌)కి మంగళవారం శ్రీకా రం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి హాజరై ప్రాజెక్టును ప్రారంభించారు. మజ్జిగౌరి మందిరానికి సమీపంలోని ఈ పాత డంప్‌సైట్‌లో పేరుకుపోయిన లెగసీ వ్యర్థాల బయో మైనింగ్‌ కోసం మున్సిపాలిటీ యంత్రాంగం టెండర్‌ ప్రక్రియ చేపట్టింది. ఈ పనులకు మూడు ప్రైవేట్‌ సంస్థలు దరఖాస్తు చేయగా నిబంధనల ప్రకారం ఝనేశ్వర్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ఎంపిక చేసి 2026 ఏప్రిల్‌ 21న పనుల ఉత్తర్వులను జారీ చేశారు. బయో మైనింగ్‌ ద్వారా పాత చెత్తను శాసీ్త్రయ పద్ధతిలో వేరుచేసి, పునర్వినియోగానికి అనువైన పదార్థాలను తిరిగి వినియోగించనున్నారు. మొత్తం 60 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను నిర్వహించేందుకు ఈ సంస్థకు 4 నుంచి 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ ప్రక్రియలో లభించే ఆర్‌డీఎఫ్‌ వ్యర్థాలను సిమెంట్‌ పరిశ్రమలకు పంపించనుండగా, తడి వ్యర్థాలను ల్యాండ్‌ ఫిల్లింగ్‌కు వినియోగించనున్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్‌ ఖెముండొ, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి దేవరాజ్‌ టక్రీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి రాయగడ మున్సిపాలిటీ చైర్మన్‌ మహేష్‌ పట్నాయక్‌, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అఽధికారి కులదీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement