రాయగడ: జిల్లాలోని మునిగుడలో వీధికుక్క భీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా రెచ్చిపోయి 8 మందిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రధానంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులపై ఈ కుక్క దాడి చేయడంతో తల్లిదండ్రుల్లో కలకలం రేగింది. మునిగుడ బస్టాండ్ సమీపంలోని త్రికొణియా కూడలి వద్ద శిశు మందిర్‌కు వెళ్తున్న రెండో తరగతి విద్యార్థి సందీప్ కరకరియా, ఎనిమిదో తరగతి చదువుతున్న సచ్చితానంద బెహరలపై వీధి కుక్క దాడి చేసి కరిచింది. గాయాలకు గురైన వారిని హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మునిఖొల్‌కు చెందిన యాకేసిన కాందరి అనే వృద్ధుడితో పాటు రథ్ హియాల్, తదుపరి మరో నలుగురిపై దాడి చేసింది. కుక్కదాడిలో గాయపడిన మొత్తం 8 మందిని మునిగుడ సీహెచ్‌సీకి చికిత్స కోసం తరలించారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుని వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.


