● స్వపరిపాలన దినోత్సవం
సందర్భంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
పర్లాకిమిడి:
స్థానిక శ్రీక్రిష్ణ చంద్రగజపతి కళాశాల మైదానంలో ఈనెల 31న స్థానిక సంస్థల స్వపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ బుధవారం ఉత్సాహంగా జరిగింది. మీడియా మిత్రులు, పురపాలక సిబ్బందితో తలపడ్డారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా, పురపాలక సంఘం చైర్‌పర్సన్ నిర్మలా శెఠి విచ్చేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. తొలుత టాస్ గెలిచిన పురపాలక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పురపాలక జట్టులో జిల్లా ఎస్పీ ప్రహ్లద్ సహాయ్ మీనా, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ట్రయల్ ఆడారు. ఆనంతరం పురపాలక జట్టు తరఫున తొలి బ్యాట్స్‌మెన్స్‌గా మైదానంలోకి ఉత్సాహంగా అడుగుపెట్టి 14 పరుగులు తీసి క్యాచ్ అవుట్ అయ్యారు. మొత్తం తొమ్మిది ఓవర్లలో 10 వికెట్లు పోగొట్టుకుని 88 పరుగులు తీశారు. మున్సిపల్ జట్టుకు దీటుగా మీడియా జట్టు తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 89 పరుగులు తీసి విజయం సాధించారు. మీడియా జట్టులో జ్ఞాన్‌రంజన్ షడంగి 50 పరుగులు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. పురపాలక జట్టు వచ్చే ఏడాది ఇంకొంచెం మెరుగైన ఆటను ప్రదర్శించాలని జిల్లా ఎస్పీ మీనా ఈ సందద్భంగా అన్నారు. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌కు మీడియా జట్టు కెప్టెన్‌గా జితేంద్ర పట్నాయిక్, వైస్ కెప్టెన్‌గా జ్ఞాన్ రంజన్ షడంగి, పురపాలక జట్టుకు కెప్టెన్‌గా లెంకమధు, బాలక్రిష్ణ పాత్రో, అంపైర్‌లుగా రాజీవ్ పాఢి, శుభం రౌత్‌లు వ్యవహారించారు. విజేతలకు ఈ నెల 31వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో జరగనున్న స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా బహుమతులను ప్రదానం చేయనున్నారు.


