జయపురం: జయపురం ముస్లిమ్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మిలాద్–ఉన్–నబీని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా జయపురం ముస్లిమ్ అంజుమాన్ కమిటీ, జయపురం ముస్లిమ్ కమిటీలు సంయుక్తంగా పట్టణ ప్రధాన మార్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జమా మసీదు నుంచి వందలాది మంది ముస్లింలు పతాకాలు చేత పట్టి సంప్రదాయ దుస్తులతో శోభాయాత్ర చేపట్టారు. ఒకరికొరు ముబారక్ చెప్పుకున్నారు. మాజీ మంత్రి, బీజేడీ నేత రబినారాయణ నందో, జిల్లా బీజేడీ కార్యనిర్వాహక అధ్యక్షుడు దుర్గా మిశ్రా తదితర నేతలు హాజరై ముస్లిమ్ సోదరులకు అభినందనలు తెలిపారు. తరణి జంక్షన్‌లో షాదీఖానా వద్ద మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు.


