కొరాపుట్: ప్రపంచ ప్రఖ్యాత హైదరాబాద్ గణేష్ ఉత్సవాలలో ఈ ఏడాది 60 అడుగుల సంకట మోచన గణపతి విగ్రహం రూపుదిద్దుకుంటోంది. కొరాపుట్ జిల్లా కేంద్రానికి చెందిన సీహెచ్ జోగారావు ఈ విగ్రహానికి ప్రధాన శిల్ప కళాకారుడిగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది కూడా జోగారావు చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ విగ్రహం ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. ఏటా ఆంధ్రా–తెలంగాణాలలో వినాయక చవితి నాడు జోగారావు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న విగ్రహాలు పూజలందుకోవడంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఖైరతాబాద్‌కు సమాంతరంగా విజయవాడలోని సితార సెంటర్‌లోనూ 76 అడుగుల వరసిద్ధి వినాయక విగ్రహం కూడా నిర్మిస్తున్నట్లు జోగారావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ రెండు విగ్రహాలనూ కేవలం మట్టితోనే నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఖైరతాబాద్ గణేష్ నిర్మాణంలో కొరాపుట్ వాసి జోగారావు
విజయవాడలో 76 అడుగుల
వరసిద్ధి వినాయకుడు


