103 కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

103 కిలోల గంజాయి స్వాధీనం

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

నలుగురు అరెస్టు

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో పోలీసులు 103 కేజీల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కేంద్ర పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసు అధికారులు వెల్లడించారు. జయపూర్‌ నుంచి నబరంగ్‌పూర్‌ మీదుగా ఆటోలో గంజాయిని కొంతమంది తరలిస్తున్నట్టు తమకు సమాచారం వచ్చినటుట పోలీసులు చెప్పారు. దీంతో అనుమానిత ఆటోని వెంబడించి పట్టుకొని పరిశీలించగా గంజాయి మూటలు ఉన్నట్టు గుర్తించారు. గంజాయిని కలహండి జిల్లా మీదుగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ ఘటనో జిల్లా కేంద్రంలోని మేదరి వీధికి చెందిన నిలాంబర్‌ హరిజన్‌, దండాసి వీధికి చెందిన బబులా హరిజన్‌, పర్మేష్‌ హరిజన్‌, దిలిప్‌ హరిజన్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గంజాయి రవాణాలో ఇతరుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని ఎస్‌ఐ సంబిత్‌ సాహు స్వాధీనం చేసుకోగా మరో ఎస్‌ఐ సీమా లక్రా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement