బీఎస్పీ వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

బీఎస్పీ వినూత్న నిరసన

Aug 15 2026 2:15 AM | Updated on Aug 15 2026 2:15 AM

మద్యం అక్రమ విక్రయాలపై..

ఎకై ్సజ్‌ అధికారులు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు

రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌ ప్రాంతంలో అనధికారికంగా విదేశీ మద్యం విక్రయాలు, అక్రమ మద్యం రవాణా జరుగుతున్నా ఎకై ్సజ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తు బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) వినూత్న రీతిలో శుక్రవారం నిరసన తెలియజేసింది. ఎకై ్సజ్‌ శాఖ అధికారుల ఫొటోలతో కనిపించడం లేదు అంటూ వ్యంగ్య పోస్టర్లు ఏర్పాటు చేసి బింసటకటక్‌ పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. బిసంకటక్‌ సమితిలోని పలు ప్రాంతాల్లో అనాధికారిక విదేశీ మద్యం విక్రయాలు, రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. బిసంకటక్‌లో ఉన్న ఏకై క విదేశీ మద్యం దుకాణం పనిచేయకపోయినా మార్కెట్‌లో వివిధ బ్రాండ్‌ల మద్యం సులభంగా లభిస్తుండటంపై వారు ప్రశ్నలు లేవనెత్తారు. లైసెన్సులు పొందిన దుకాణాలు పనిచేయకపొతే ఇంత పెద్ద మొత్తంలో మద్యం ఎక్కడి నుంచి వస్తుందని, ఎలా విక్రయమవుతుందని నిలదీశారు. బీఎస్పీ రాష్ట్ర శాఖ ఇన్‌చార్జి జితు జకసిక ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసి, బిసంకటక్‌లో అక్రమ మద్యం రవాణాపై ఆరోపణలు చేశారు. సమీపంలోని మునిగుడ సమితి పరిలోని అమలాభట్ట ఉన్న మూతపడిన విదేశీ మద్యం దుకాణం నుంచి బిసంకటక్‌కు అక్రమంగా మద్యం సరఫరా అవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆరోపణలను సంబంధిత అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. అక్రమ మద్యం వ్యాపారం జరుగుతోందని ఆరోపణలు ఉన్నప్పటికీ ఎకై ్సజ్‌ శాఖ నుంచి చాలా కాలంగా సరైన తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు కనిపించడం లేదని బీఎస్పీ నాయకులు విమర్శించారు. నిరసనలో భాగంగా ఏర్పాటు చేసిన పోస్టర్లలో రాయగడ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌, గుణుపూర్‌ సబ్‌ డివిజనల్‌ ఎకై ్సజ్‌ అధికారి, బిసంకటక్‌ ఎకై ్సజ్‌ అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ వారు తమ కార్యాలయాల నుంచి కనిపించడం లేదు అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. బీఎస్పీ అధ్యక్షుడు పూర్ణ చంద్రటక్రీ మాట్లాడుతూ.. ఇది అధికారుల వ్యక్తిగతంగా కనిపించకుండా పొయారనే ఫిర్యాదు కాదని స్పష్టం చేశారు. ఎకై ్సజ్‌ శాఖ పనితీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని శాంతియుతంగా, ప్రసాస్వామ్యం, వ్యంగ్య పద్ధతిలో వ్యక్తం చేయడమే ఈ నిరసన ఉద్దేశమని స్పష్టం చేశారు. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. ఇదే అంశంపై బిసంకటక్‌ పోలీస్‌ స్టేషన్లో ఎకై ్సజ్‌ శాఖ అధికారుల కనిపించకపోవడంపై తమ పార్టీ తరఫున ఫిర్యాదు కూడా సమర్పించామని వివరించారు. ఆసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలో ఈ అంశంపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిరసన కార్యక్రమంలో లదా హికక, రామ్‌ దాస్‌ టక్రీ, దివాకర్‌ టక్రీ, సుమంత్‌ కరకరియా, ఆదివాసీ నాయురాలు డింజొ జకసిక, చిత్రసేన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement