రాయగడ: జిల్లా పరిపాలనలో డిజిటల్ కమ్యూనికేషన్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు అధికారులు, సిబ్బంది శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే దిశగా జిల్లా పరిషత్ భవన్‌లో రెండు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా పరిషత్ భవన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఒస్వాన్ కాన్ఫరెన్స్ హాల్, ఓపెన్ జిమ్‌ను కలెక్టర్ అశుతోష్ కులకర్ణి శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ కెముండొ, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


