రాయగడ: రాయగడ ప్రెస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. స్థానిక సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ హాలులో యూనియన్ అధ్యక్షుడు అమూల్య రత్న సాహు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఐదుగురు సభ్యులతో ఎన్నికల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల కమిటీ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా అంగీకరించేందుకు యూనియన్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సురేష్ చంద్ర సాహు, అమూల్యనిషాంక, ప్రసన్న పండ, ప్రదీప్ పాత్రొలతో జరిగిన చర్చల అనంతరం నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను వెల్లడించారు. యూనియన్ అధ్యక్షుడిగా ఇప్పిలి సర్వేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా నరేష్‌కుమార్ పాత్రో, ప్రధాన కార్యదర్శిగా శివాజీ దాస్, సహాయ కార్యదర్శిగా తుషార్ రంజన్ సాహు, కోశాధికారిగా ధరణీధర్ పట్నాయక్‌లను ఎన్నుకున్నారు. సురేష్ చంద్ర దాస్, అమూల్యరత్న సాహు, మౌడి బారిక్‌లను సలహా మండలి సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సర్వేశ్వరరావు మాట్లాడుతూ జర్నలిస్టుల మధ్య ఎటువంటి వివక్ష, పక్షపాతం లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు.


