● కష్టపడితేనే ఫలితం | - | Sakshi
Sakshi News home page

● కష్టపడితేనే ఫలితం

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

రాయగడ: విద్యార్థులు తమ భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకొవాలంటే కష్టపడాలని సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేష్‌ కుమార్‌ పాఢి అన్నారు. కష్టపడితే తానంతట అదే ఫలితం వస్తోందని.. విద్యార్థులు ఈ విషయాన్ని గట్టిగా నమ్మకొని శ్రద్ధంగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక పితామహాల్‌లోని వర్సిటీ ప్రాంగణంలో సెంచూరియన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో శుక్రవారం జరిగిన స్వాగత కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం ముందుగా ఉపాధ్యాయులు ద్వీపప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీబీఎస్‌ఈ, సీహెచ్‌ఎస్‌ఈ బోర్డులకు చెందిన 150 మంది ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. పోటీ ప్రపంచంలో క్రమశిక్షణ, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యం ఉందని పాఢి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో సీనియర్‌ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాత్మక ఆటలు నిర్వహించి కొత్త విద్యార్థులను ఆకట్టుకున్నారు. అనంతరం కేక్‌ కట్‌చేసి ఆస్వాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement