చరిత్ర పరిశోధకుడు బిజయ్‌ మిశ్ర మృతి | - | Sakshi
Sakshi News home page

చరిత్ర పరిశోధకుడు బిజయ్‌ మిశ్ర మృతి

Aug 6 2026 1:15 AM | Updated on Aug 6 2026 1:15 AM

కొరాపుట్‌: ప్రముఖ చరిత్ర పరిశోధకుడు బిజయ్‌ మిశ్ర (65) అనారోగ్యంతో మృతి చెందారు. నబరంగ్‌పూర్‌కు చెందిన బిజయ్‌ మిశ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ విశాఖ పట్నంలో కన్ను మూశారు. కొరాపుట్‌ జిల్లాలో స్వాతంత్య్ర పోరాటాల చరిత్ర పై బిజయ్‌ మిశ్ర అనేక పరిశోధనలు చేశారు. అనేక పుస్తకాల రచయితగా, ప్రముఖ పత్రికలలో కాలమిస్ట్‌గా, విద్యా వేత్తగా రాష్ట్ర వ్యాప్తంగా పేరొందారు. జిల్లాలో విద్యారంగంలో చేసిన సేవలు పేరు తెచ్చాయి. మృతదేహం నబరంగ్‌పూర్‌ చేరుకున్న వెంటనే బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి, డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి, మాజీ జిల్లా పరిషత్‌ ప్రెసిడెంట్‌ మంజులా మజ్జి, మాఘరో కన్వీనర్‌ కాధంబని త్రిపాఠి, పలువురు కవులు, రచయితలు, విద్యా వేత్తలు బిజయ్‌ మిశ్ర మ్రత దేహం వద్ద నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement