పర్లాకిమిడి: ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ అక్షయ సునిల్ అగర్వాల్ ఽఆధ్వర్యంలో సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. దీనిలో భాగంగా డీపీఆర్‌వో ప్రదీప్త గురుమయి అధ్యక్షతన గజపతి స్టేడియంలో ఉదయం 9.15 గంటలకు జాతీయ జెండా ఎగురవేయడానికి నిర్ణయించారు. అలాగే విద్యార్థులకు ఈనెల 10న వక్తృత్వ, డ్రాయింగ్, సంగీతం, వ్యాస రచన పోటీలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ బిరంచీ బేగ్, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, ఉత్కళ హితేషినీ అధ్యక్షుడు పూర్ణచంద్ర మహాపాత్రో, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, జిల్లా మెడికల్ ఆఫీసర్ ప్రఫుల్ల కుమార్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.


