శ్రమదానంతో తాత్కాలిక వంతెన ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

శ్రమదానంతో తాత్కాలిక వంతెన ఏర్పాటు

Jul 31 2026 2:15 AM | Updated on Jul 31 2026 2:15 AM

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి దొరాగుడ గ్రామ పంచాయతీ రామగుడ గ్రామ ప్రజలు అనేక ఏళ్లుగా తాత్కాలిక కర్ర వంతెన(కల్వర్ట్‌) ఆధార పడుతున్నారు. గత ఏడాది భారీ వర్షాలకు ఆ వంతెన కొట్టుకుపోయింది. వంతెన నిర్మించాలని ఎంతగా వేడుకున్నా ఎవరూ స్పందించలేదు. దీంతో గ్రామస్తులే చేయి చేయి కలిపి కొత్తగా తాత్కాలిక వంతెనను నిర్మించుకున్నారు. ఈ వంతెన(కల్వర్టు) తమ గ్రామానికి ప్రధాన మార్గం అని, వర్షాకాలంలో నీరు ఎక్కువగా ప్రవహించటం వల్ల ఆ మార్గంలో రాకపోకలు నిలిచి పోతాయని గత నెల 9 వ తేదీన అదే జరిగిందని వెల్లడించారు. వంతెన కొట్టుకుపోవటం వల్ల వర్షాకాలంలో దొరాగుడ గ్రామ పంచాయతీతో రహదారి సంబంధాలు కోల్పోతున్నామని వెల్లడించారు. పాఠశాలలకు, అంగన్‌వాడీలకు వెళ్లాల్సిన పిల్లలు రైతులు, కూలీలు దొరాగుడ వెళ్లాలంటే ఆ వంతెన నిర్మాణం ఎంతో అవసరమన్నారు. వంతెన కొట్టుకు పోవటం వల్ల ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు పట్టించుకోకపోవడంతో తామే కల్వర్టు నిర్మించుకుంటున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement