మల్కన్‌గిరి: జిల్లా కేంద్రానికి చెందిన సౌభాగ్య సుందర్ నాయక్ నీట్ పరీక్షలో సత్తాచాటాడు. 720 మార్కులకు గానూ 671 మార్కులు సాధించాడు. అలాగే ఎంవీ 37 గ్రామానికి చెందిన బిప్లబ్ ఠాకూర్ 720 మార్కులకు గానూ 621 మార్కులు సాధించాడు. దీంతో వీరిని పలువురు అభినందించారు.
రైలు మార్గానికి భూములు అప్పగింత
జయపురం: జయపురం – నవరంగపూర్ నూతన రైలు మార్గం కోసం ఎంపిక చేసి సేకరించిన భూములను రైల్వే అధికారులకు అప్పగించే కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. బొరిగుమ్మ తహసీల్ ఆధీనంలోని బొరగాం, అవుళి మౌజాల్లో 30.410 ఎకరాల భూమిని రైల్వే అధికారులకు అప్పగించారు. భూమిని అప్పగించిన 34 మంది రైతులకు పరిహారం పంపిణీ చేసినట్లు తహసీల్దార్ బెహర వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్ ఉద్యోగులు సంజీవ్ టక్రి, అవులి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సబితా నాయిక్, బాలాజీ సంగ్, రైల్వే అశికారి సాయి రామకృష్ణ, జూనియర్ ఇంజినీర్ గోవింద బారిక్ తదితరులు పాల్గొన్నారు.


