న్యూస్‌రీల్
యాత్రకు ట్రాఫిక్ సమస్య పర్లాకిమిడిలో గుండిచా యాత్రకు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. భక్తులు ఇబ్బంది పడ్డారు. –8లోu
దుకాణాల్లో తనిఖీలు జయపురంలో దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్ర వస్తువులనే విక్రయించాలన్నారు. –8లోu
మత్స్య, కూర్మావతారాల్లో..
శ్రీ మందిరం ఆదాయం
నగదు : రూ. 2,71,975
బంగారం : 2 గ్రాముల 600 మిల్లీ గ్రాములు
వెండి : 27 గ్రాములు – భువనేశ్వర్/పూరీ
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026
జయపురం: రథయాత్ర ఉత్సవాల్లో గుండిచా మందిరంలో శ్రీజగన్నాథ, బలభధ్ర, సుభధ్ర దేవతామూర్తులు పది అవతారాలలో భక్తులకు దర్శనం ఇవ్వడం పరిపాటి. ఆయా అవతారాల్లో తమ ఆరాధ్య దేవతలను దర్శించి భక్త జనం పూజలు జరిపి తరిస్తారు. జయపురంలో ఒక దినం ఆలస్యంగా రథయాత్ర ప్రారంభం కావటం వలన శనివారం రెండు అవతారాల్లో అనగా మత్స్య, కూర్మావతారాలలో దారు దేవతలు భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా అవతారాల్లో జగన్నాథ, బలభధ్ర, సుభద్రలను దర్శించి తరించేందుకు భక్త జనం పోటెత్తారు. అలాగే బోయిపరిగుడ గుండిచా మందిరంలో కూర్మావతారంలో దారు దేవతలు భక్తులకు శనివారం రాత్రి దర్శనమిచ్చారు. అయితే జయపురం సమితి కొట్‌పాడ్‌లో వరావతారంలో జగన్నాథుడు దర్శనమిచ్చారు.
నృసింహా, వరాహా అవతారాల్లో జగన్నాథ,
బలభద్రులు దర్శనం
పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరంలో వేంచేసిన జగన్నాథ, సుభద్ర, బలభద్రులు ఆదివారం నృసింహా, వరాహా అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నృసింహా అవతారం వద్ద ప్రహ్లాదుడు, భూమండలాన్ని కాపాడిన స్వయంగా జగన్నాథుడు వరాహా అవతారంలో వచ్చారు. స్వామివారి మహా అవతారాలు చూడటానికి భక్తులు భారీగా పోటెత్తారు. అలాగే రాయగడ బ్లాక్ ప్రసిద్ధి చెందిన జిరంగోలో కూడా చుట్టుపక్కల అదివాసీ గ్రామాల నుంచి భక్తులు విచ్చేసి జగన్నాథ, బలభద్రుడు, సుభద్రలను దర్శించుకున్నారు. సోమవారం హిరాపంచమి సందర్భంగా లక్ష్మీదేవి గుండిచా మందిరం సందర్శిస్తుంది. జిరంగో గ్రామంలో హిరాపంచమి రోజున చాలామంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
● రాయగడ: పొదరి శుభద్ర, సొదరుడు బలభద్రునితో గుండిచా మందిరంలో కొలువైయున్న జగన్నాథుడు దశవతారాల్లో భాగంగా ఆదివారం వరహావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి వారి దివ్యదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


