పర్లాకిమిడి: నీట్ పరీక్ష పత్రం లీక్ ఘటనలో కేంద్ర ఉన్నత విద్యా మండలి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా పర్లాకిమిడి రాజావారి ప్యాలస్ వద్ద గణ ధర్నా ఆందోళన ఉదయం జరిపారు. ఈ ప్రతిబాద్ ధర్నాలో అనేక మంది సామాజిక కార్యకర్తలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రగతి మహిళా సంఘటన్, రైతు కూలీ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు శిశిరోకుమార్ భంజ సామంత్ డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శతపథి, రోక్కం లోకనాథం, సంతోష్ కుమార్ పండా, లింగ రాజ్ పాణిగ్రాహి, సెన్యాగోమంగో తదితరులు పాల్గొన్నారు.


