పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి పంచాయతీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ జాయింట్ గ్రీవెన్స్ సెల్‌కు అత్యల్పంగా స్పందన లభించింది. ఈ స్పందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్ అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత్ సి.డి.ఒ దయామయ పాడీ, ఆర్.ఉదయగిరి పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు, తదితరులు హాజరాయ్యరు.
మొత్తం 28 వినతులు అందాయి. వీటిలో వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించినవి 15 ఉన్నాయి. నలుగురి వయోవృద్ధులకు మధుబాబు పింఛన్ కార్డులను అందజేశారు. రెడ్ క్రాస్ సహాయ నిధి నుంచి సులోచన రౌత్‌కు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్.ఉదయగిరి పంచాయతీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ శోబోరో, బీడీఓ లారీమాన్ ఖర్సల్, తహసీల్దార్ జ్యోతిమయ దాస్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


