నీటితో నిండిన పడవలు | - | Sakshi
Sakshi News home page

నీటితో నిండిన పడవలు

Jul 21 2026 12:41 AM | Updated on Jul 21 2026 12:41 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి జలశాయం ప్రాంతంలో 250కు పైగా కొత్త పడవలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. జలశాయంపై వందలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వారి జీవనోపాధి చేపలు వేటే. ఈ ప్రాంతంలో మత్స్యకారులు జీవనోపాధిని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సేతు పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా కొత్త పడవలను అందించే పథకాన్ని ప్రారంభించింది. ఈ పడవలను నిర్మాణం జరిగి 6 నెలలైనా సరే లబ్ధిదారులకు అందజేయకుండా అలాగే వదిలేశారు. ఇక్కడ పడుతున్న వర్షాలకు పడవల్లో నీరు చేరింది. దీని చూస్తున్న ప్రజలు నీటిలో ఉండాల్సిన పడవలు నీటితో నిండిపోయాయని అంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మత్స్యశాఖతో చర్చించి తమకు పడవలు అప్పగించాలని కోరారు. ఇలా అయితే తమకు లైఫ్‌ జాకిట్లు, తెడ్లు, వలలు, ఇతర సామగ్రి ఏప్పటికి ఇస్తారో అని అంటున్నారు. ప్రభత్వం ఈ పథకానికి ఎంత నిధులు మంజూరు చేసిందో వివరాలు తలుసుకొని అధికార్లు తమకు పడవలు అప్పగంచాలని గిరిజనులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement