భువనేశ్వర్: పూరీ సెక్టార్ 3 సమీపం తీరంలో స్నానం చేస్తుండగా కొట్టుకుపోయిన ఇద్దరు పర్యాటకులు అలల్లో కొట్టుకు పోయారు. విషయం దృష్టికి రావడంతో సాగర తీరంలో పహరా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లైఫ్ గార్డు సిబ్బంది తక్షణమే అలల్లోకి దూకి కాపాడి ఒడ్డుకు సురక్షితంగా చేర్చారు. బతికి బయటపడిన పర్యాటకులను జార్ఖండ్‌కు చెందిన అమన్, బీహార్‌కు చెందిన రవి కుమార్‌గా గుర్తించారు.
ధాన్యం కొనుగొళ్లలో వెయ్యి కోత
రాయగడ: ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం ధాన్యం విక్రయించాల్సిన రైతులు, మిల్లర్ల ఒత్తిడి కారణంగా ప్రతి క్వింటాల్‌కు వెయ్యి రూపాయల తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందంటూ రాయగడ జిల్లా పద్మపూర్ ప్రాంత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గుణుపూర్ సబ్ కలెక్టర్ దూదుల్ అభిషేక్ దిలీప్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల కథనం ప్రకారం, ప్రభుత్వ నిబంధనల మేరకు సహకార సంఘాల్లో నమోదు చేసుకుని మండీల ద్వారా ధాన్యం విక్రయించేందుకు అవసరమైన లన్ని ప్రక్రియలను పూర్తి చేశారు. అయితే ధాన్యం కొనుగోలు చేసే సమయంలో కొందరు మిల్లర్లు ప్రభుత్వ ధరకు కొనుగోలు చేయకుండా ప్రతీ క్వింటాల్‌కు వెయ్యి రూపాయలు తగ్గించి విక్రయిస్తేనే ధాన్యాన్ని తీసుకుంటామని షరతు విధించారని ఆరోపించారు. అంగీకరించని రైతుల ధాన్యాన్ని వివిధ కారణాలు చూపుతూ రోజుల తరబడి ఖరీదు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని రైతులు వివరించారు. దీంతో ధాన్యం బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉండి వర్షాలు, గాలులు వంటి ప్రకృతి ప్రభావాలతో పంట దెబ్బతింటుందనే భయంతో రైతులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. చివరకు ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్‌కు రూ.3,100 బదులుగా కేవలం రూ.2,100కే ధాన్యాన్ని విక్రయించాల్సిన దుస్థితి ఎదురైందని రైతులు వాపోయారు. ప్రతి క్వింటాల్‌కు వెయ్యి రూపాయల చొప్పున నష్టపోయామని అన్నారు. మండీ వ్యవస్థ, మద్దతు ధర విధానాలు సమర్థంగా అమలు కావడం లేదని ఆరోపించారు.
లయన్స్ సేవలు ప్రశంసనీయం
రాయగడ: లయన్స్ క్లబ్ అపరాజిత సంస్థ సేవలు ప్రశంసనీయమని క్లబ్ డిస్టెట్ గవర్నర్ అశ్విన్ కుమార్ దాస్ కొనియాడారు. స్థానిక లయన్స్ క్లబ్ సమావేశం హాల్‌లో శనివారం సాయంత్రం లయన్స్ రాయగడ అపరాజిత ఇన్‌స్టాలేషన్ కార్యక్రమంలో ముఖ్యఅతిఽథిగా ప్రసంగించారు. గత ఏడాది ఆవిర్భవించిన లయన్స్ అపరాజిత సంస్థ ఏడాదిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువైందన్నారు. లయన్స్ క్లబ్‌లో భాగమైన ఈ సంస్థలో మహిళలు సేవాదృక్పథంతో ముందుకు రావడం అభి నందనీయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ము ఖ్యంగా సంస్థలోని మహిళలు సమయాన్ని కేటాయించి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు. లయన్స్ అపరాజిత సంస్థ కార్యదర్శి బరాటం అవంతి వార్షిక నివేదికను చదివి వినిపించారు.
నూతన కార్యవర్గం: లయన్స్ అపరాజిత 2026– 27 ఏడాదికి గాను కొత్త కార్యవర్గం ఏర్పాటయ్యింది. అధ్యక్షురాలిగా పెంట కల్యాణి, కార్యదర్శిగా ఎస్.శ్రావణి, కోవాధికారిగా రంజిత్ బిసోయిలు నియమితులయ్యారని డిస్టెట్ గవ ర్నర్ అశ్విన్ కుమార్ ప్రకటించారు. అనంతరం కొత్త కార్యవర్గానికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి సభ్యు లు అభినందించారు. కార్యక్రమంలొ లయన్స్ జీఎల్‌టీ కోఆర్డినేటర్ సుస్రిత దాస్, లయన్స్ కేబినేట్ సెక్రటరీ టి.జయరాం పాల్గొన్నారు.


