సివిల్‌ సప్లయ్‌ జిల్లా మేనేజర్‌గా శ్రీనివాసరావు | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ సప్లయ్‌ జిల్లా మేనేజర్‌గా శ్రీనివాసరావు

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌గా పి.శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈయన కోనసీమ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా మేనేజర్‌గా పనిచేసిన వేణుగోపాల్‌ను మాతృభాషకు పంపించారు.

‘కేజీబీవీల్లో ఖాళీలు భర్తీ చేయాలి’

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి బోధనా సిబ్బంది నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఖాళీలను భర్తీ చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం అంబేడ్కర్‌ విజ్ఞాన మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ పేడాడ కృష్ణారావు మాట్లాడుతూ గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి ప్రధాన సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల చదువు తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని నోటిఫికేషన్‌ ప్రకారం కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

నీలకంఠేశ్వర ఆలయంలో హుండీ చోరీ

పాతపట్నం: పాతపట్నం మహేంద్రతనయ నదీ తీరాన ఉన్న శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో బుధవారం అర్ధరాత్రి హుండీ చోరీ జరిగింది. దుండగులు ఆలయం ప్రహరీ దూకి లోపలకు వచ్చారు. ఆలయం గర్భగుడి నుంచి బయటకు వచ్చే దారిలోని సేఫ్టీ గిల్స్‌కు ఉన్న రెండు తాళాలు పగలగొట్టి లోపలకి ప్రవేశించారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ముగ్గురు వచ్చినట్లు సీసీ పుటేజ్‌లో కనిపిస్తోంది. దుండగులు ముసుగులు వేసుకున్నారు. గురువారం ఉదయం ఆలయ అర్చకులు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు సేఫ్టీ గ్రిల్స్‌కు ఉన్న తాళాలు పగలగొట్టి ఉండడంతో వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు తెలిపారు. ఎస్‌ఐ కె.మధుసూదనరావు, క్లూస్‌ టీం బృందం వచ్చి, ఆధారాలు సేకరించారు. సుమారు రూ.20 వేలు నగదు ఉంటుందని అర్చకులు తెలిపారు.

గుర్తు తెలియని మహిళ

మృతదేహం లభ్యం

పలాస, శ్రీకాకుళం క్రైమ్‌ : పూండి – నౌపడ రైలు మార్గంలోని వల్లభరావుపేట రైలు ట్రాక్‌ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం గురువారం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పోల్‌ నంబర్‌ 28/30 వద్ద డౌన్‌లైన్‌ ట్రాక్‌పై సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళ ఛామన ఛాయ రంగు, నెరిసిన జుట్టు, కుడి ముంజేటిపై ఒడియా లిపిలో జై శ్రీరామ్‌ అని పచ్చబొ ట్టు రాసి ఉందని తెలిపారు. ఈమె యాచకురాలై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు పలాస రైల్వే స్టేసన్‌ ఎస్‌ఐ డి.శ్రీనివాసరావును 9492250069 నంబర్‌ ద్వారా ఫోన్‌ చేసి సంప్రదించాలని కోరారు.

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

టెక్కలి రూరల్‌: స్థానిక జగతి మెట్ట సమీపంలో నివాసముంటున్న ధవళ అనిత(43) అనే అనే వివాహిత బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అనిత విజయనగరం జిల్లా జీఎస్టీ కార్యాలయం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త జన్ని హరి సంతబొమ్మాళి మండలంలో డీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ జగతిమెట్ట సమీపంలో నివాసముంటున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని క్లూస్‌ టీం పరిశీలించిన తర్వాత శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మృతురాలికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నా డు. అనంతరం టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement