యాత్ర సంబంధిత కార్యక్రమాల నిర్వహణలో అవాంఛనీయ జాప్యం కారణంగా రథాలు నిర్ధారిత వేళలో గమ్యం చేరలేకపోయాయి. సాయంత్రం 5.10 గంటల నుంచి రథాల కదలిక ఆరంభించి 7.25 గంటల వరకు రథాలు లాగడం కొనసాగించారు. అయితే చీకటిపడడంతో ఆలయ సంస్కారాల ప్రకారం రథాలు లాగడం మర్నాటికి వాయిదా వేశారు. తొలుత బలభద్ర స్వామి రథం కదలగా వెంబడి దేవీ సుభద్ర రథం యాత్ర ప్రారంభమైంది. చివరగా శ్రీజగన్నాథుని నందిఘోష్ రథం నెమ్మదిగా మొదలైంది. మొదట బయల్దేరిన బలభద్ర స్వామి రథం జనతా సినిమా హాలు సమీపంలో నిలిపివేశారు. దేవీ సుభద్ర రథం దర్పదళనం మారీచ్‌కోట్ వరకు ఆగిపోయింది. చివరగా బయల్దేరిన జగన్నాథుని నందిఘోష్ రథం లాంచనంగా కొద్దిదూరం కదిలిన తర్వాత నిలిపివేశారు.


