ఒడియా పక్షోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఒడియా పక్షోత్సవాలు

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
ఉత్సాహంగా..

మహాపురుషులకు వందనాలు

కార్యక్రమానికి ప్రముఖులు హాజరు

లయంలో సంస్కృతం, ఒడియా భాషల్లో పోసు్ట్రగాడ్యుయేషన్‌ పూర్తిచేశారన్నారు. ఆయన పురుషోత్తమ శ్రీజగన్నాథ గ్రంధాన్ని రాశారని అన్నారు. తదుపరి పర్లాకిమిడి మహారాజా శ్రీక్రిష్ణచంద్రగజపతి నారాయణ దేవ్‌ ఉత్కళ రాష్ట్ర సాధనకు చేసిన కృషిని మాజీ ఒడియా సాహిత్య అకాడమి సభ్యులు బిచిత్రా నంద బెబర్తా వివరించారు. అలాగే జయపురం మహారాజా విక్రందేవ్‌ వర్మ, పండిత మధుసూదన్‌ దాస్‌, గంగాధర్‌ మెహార్‌, చికిటి మహారాజు, గోపబంధుదాస్‌, మహాపురుషులు స్వతంత్ర ఒడిశా కోసం చేసిన పోరాటాన్ని ప్రస్తావించారు. అనేక మంది ఉపాధ్యాయులు, రచయితలు మాట్లాడారు. వారికి ముఖ్యఅతిథి డీసీవో అర్చనా మంగరాజ్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. శుభ్రాంశు పట్నాయక్‌ సభకు ముఖ్యవక్తగా వ్యవహారించారు.

పర్లాకిమిడి: ఒడిశా దివస్‌ పక్షోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ‘వందనాలు మహాపురుషులు’కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా. అనేక మంది కవులు, రచయితలు, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్‌, రాష్ట్రపతి ఆవార్డు గ్రహీత బినోద్‌ జెన్నా, బిచిత్రానంద బెబర్తా, పర్యాటక శాఖ మాజీ అధికారి రామచంద్ర హాజరయ్యారు. తొలుత ఒడిశా ప్రత్యేక రాష్ట్రానికి పునాది వేసిన డాక్టర్‌ సత్యన్నారాయణ రాజగురు చరిత్ర గురించి బినోద్‌ జెన్నా వివరించారు. శతాబ్ది పురుషుడైన పద్మశ్రీ సత్యన్నారాయణ రాజగురు తండ్రిగారు హారికృష్ణరాజగురు పర్లాకిమిడి మహారాజా క్రిష్ణచంద్రగజపతి నారాయణదేవ్‌కు గురువుగా విద్యాబుద్ధులు చెప్పేవారని అన్నారు. 1903 ఆగస్టు 19న జన్మించిన సత్యన్నారాయణ రాజగురు 1997లో కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్నారని గుర్తు చేశారు. ఆయనకు తెలుగుతో పాటు ఏడు భాషలపై పట్టుసాధించారన్నారు. ఆంధ్ర విశ్వవిద్యా

బిషుభ సంక్రాంతికి ముహూర్తపు రాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement