కొరాపుట్: కిరండోల్ రైల్వే మార్గంలో బాలుడి మృతదేహం వివాదం రేపింది. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి మీదుగా వెళ్లే విశాఖ పట్నం–కిరండోల్ రైల్వే మార్గంలో మాలి బెల్గావ్ గ్రామ పంచాయతీ ఖజేల్ గ్రామ సమీపంలో సంసాగర్ గ్రామానికి చెందిన రామ్ రంగుడ కుమారుడు సుభం రంగుడ (17) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఒక చేయి,కాలు తెగి పడి ఉన్నాయి. హఫ్ ప్యాంట్‌లో మృతదేహం ఉంది. ఇతడు శుభం పాడువాలో రాధాకృష్ణ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఇంటర్ చదువుతున్నాడని కుటుంబీకులు పేర్కొన్నారు. తన మేనమామ ఇంటికి ఉత్సవాలు సందర్భంగా వచ్చి మృతదేహమై కనిపించాడని తెలిపారు. కొరాపుట్ ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ దీపక్ మజ్జి ఆదేశాల మేరకు ఆర్పీఎఫ్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నందపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆర్పీఎఫ్ ఎస్‌ఐ సాగరిక ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


