సరా గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన | - | Sakshi
Sakshi News home page

సరా గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

పర్లాకిమిడి: సుప్రీంకోర్టు ఇటీవల నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కాశీనగర్‌ బ్లాక్‌ వంశధార పరివాహక ప్రాంతం సరా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి ఆదివారం కాశీనగర్‌ బ్లాక్‌ ముంపు గ్రామాలైన సరా, బడిగాంలు సందర్శించి అక్కడ వంశధార సురక్షామంచ్‌ సభ్యులతో భేటీ అయ్యారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాట్రగడ వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణం చేపడితే ఒడిశాలోని గజపతి జిల్లా కాశీనగర్‌ ప్రాంతంలో ఏడు గ్రామాలు ముంపునకు గురవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తదుపరి రైతులకు నష్టపరిహారం, ఒడిశా ప్రభుత్వం దీనికి ప్రత్నామ్యాయంగా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని, అలాగే గజపతి జిల్లా కాశీనగర్‌ రైతుల ప్రయోజనం కోసం, దీనిపై ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి అసెంబ్లీలో ఒడిషా డబుల్‌ ఇంజిన్‌ సర్కారుపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తానని ఆయన విలేకరులకు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement