జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 57 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. యూనివర్సిటీ ఎన్.సి.సి (నేషనల్ క్రెడెట్ క్రాఫ్) క్యాడెట్‌లు, ఎన్.ఎస్.ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) యూనిట్, వైఆర్‌సీ(యూత్ రెడ్ క్రాస్) విద్యార్థులు సంయుక్తంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ సీపీజీసీ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో ముఖ్యఅతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన అవసరాన్ని వివరించారు. సమాజంలో ఏ ఒక్కరూ రక్త లేమి వలన మరణించ కూడదన్నారు. జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్ రక్త భండార్ టెక్నీషియన్‌లు దాతల నుంచి రక్తం సేకరించారు. కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, లెఫ్ట్‌నెంట్ సంతోషి, వైఆర్‌సీ కోఆర్డినేటర్ డాక్టర్ రుసవ కుమార్ సాహు, తదితరులు పాల్గొన్నారు.


