రాయగడ: స్థానిక ఫ్రెండ్స్ ఎంజీఎఫ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టులో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ట్రస్టులో ఉంటూ చదువుకుంటున్న నిరుపేద ఆదివాసీ విద్యార్థినులకు దంత వైద్య పరీక్షలు చేశారు. డాక్టర్ రాజేష్‌కుమార్ పాత్రో, డాక్టర్ భోగి సంతోష్‌కుమార్, డాక్టర్ భోగి స్వరూపలు విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు టూత్ బ్రష్‌లు, టూత్ ఫేస్టులు, టంగ్ క్లీనర్లను క్లబ్ సభ్యులు పంపిణీ చేశారు. దంతాల రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్లబ్ అధ్యక్షులు మోనింగి శ్రీహరి, సాధారణ కార్యదర్శి కింతలి శ్రీధర్, కోశాధికారి లాడి నూకరాజు, సభ్యు లు ఇప్పిలి సన్యాసిరాజులు ట్రస్టు నిర్వహకులకు ధన్యవాదాలు తెలియజేసారు. వైద్య శిబిరాలను తరచూ నిర్వహిస్తామని క్లబ్ సభ్యులు తెలిపారు.


