డిగ్రీ ఫలితాల్లో సత్తా చాటాం.. | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ ఫలితాల్లో సత్తా చాటాం..

Mar 5 2026 7:16 AM | Updated on Mar 5 2026 7:16 AM

● నెల్లిమర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ప్రిన్సిపాల్‌ రేఖ

నెల్లిమర్ల: డిగ్రీ పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కందుల రేఖ తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసిన డిగ్రీ ఐదో సెమిస్టర్‌ ఫలితాల్లో బీఏ హిస్టరీ 84%, బీకాం 80%, బీఎస్సీ కెమిస్ట్రీ 100% బీఎస్సీ జువాలజీ 73. 3%, బోటనీ మైనర్‌ 100/%, భౌతిశాస్త్రం మైనర్‌లో 100% ఫలితాలు సాధించినట్లు చెప్పారు. అంతేకాకుండా హిస్టరీ, పాలిటిక్స్‌ ఎకనామిక్స్‌ మైనర్స్‌ 100% ఫలితాలు సంపాదించడం గమనార్హం. కళాశాలకు చెందిన విద్యార్థులు వై.బుచ్చమ్మ, బద్రి కృష్ణవేణి, ఎరకమ్మ, దేవకుమారి మంచి మార్కులు సాధించడంతో ఆమె అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement