నెల్లిమర్ల: ఈ నెల 6న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఈ మేరకు స్థానిక ఎంఆర్‌సీ సిబ్బంది ఎంఈఓ యూఎస్‌ఎన్ మూర్తిని బుధవారం కలిసి ఆ రోజున మాస్ లీవ్ మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ సభ్యుడు ఆరికతోట రామకృష్ణ మాట్లాడుతూ.. సమగ్రశిక్షలో పనిచేస్తున్న 18 విభాగాల ఉద్యోగులకు ఏడు సంవత్సరాలుగా జీతాలు పెరగలేదన్నారు. అలాగే గత ప్రభుత్వం ఎంటీఎస్ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎల్‌డీఏఎన్ పార్వతి, ఎంఐఎస్ ఎం. ప్రశాంతి, మెస్సెంజర్ గోవిందమ్మ, తదితరులు పాల్గొన్నారు.


